సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవి. ఈ బ్యూటీ చేసినవి తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల మనస్సులో మాత్రం చెరిగిపోని ముద్ర వేసుకుంది. ఆమె నటించిన సినిమాలు చూసుకుంటే అందులో సాయి పల్లవిని తప్ప మరో హీరోయిన్ ని ఊహించుకోలేము. అంతలా ఆమె ఇంపాక్ట్ ఆయా పాత్రాలలో కనిపిస్తుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఆమె పాత్రకి ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇక వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే ఆమె చివరిగా గార్గి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దాని తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాని ప్రకటించలేదు.
అయితే ఆమె సినిమాలని పక్కన పెట్టి డాక్టర్ గా సెటిల్ అయ్యే పనిలో ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఒక హాస్పిటల్ ని నిర్మిస్తుందని కూడా టాక్ నడుస్తుంది. ఇప్పుడు దానిని పూర్తి చేసే పనిలో సాయి పల్లవి బిజీగా ఉందని టాక్ నడుస్తుంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదనే మాట కూడా వినిపిస్తుంది. తాజాగా మరో సినిమా కోసం సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. మధు మంతెన, అల్లు అరవింద్ రామాయణం సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హృతిక్ రోషన్ రావణుడిగా కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం అయ్యింది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతుందని టాక్. ఇక ఇందులో సీత పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అఫీషియల్ గా ప్రకటించకపోయిన ఆ పాత్రలో నటించడానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీత పాత్రకి సాయి పల్లవి పెర్ఫెక్ట్ అని భావించి ఆమెని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.