సౌత్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ సాయి పల్లవి. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని ఈ బ్యూటీ క్రియేట్ చేసుకుంది. సాయి పల్లవి కోసమే థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసేవారు ఉన్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఈ బ్యూటీ బెస్ట్ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుని కూడా తీసుకుంది. అలాగే విరాటపర్వం సినిమాలో కూడా నటిగా అందరిని మెప్పించింది. ఇదిలా ఉంటే తమిళ్ లో కూడా ఇప్పటికే సాయి పల్లవి నాలుగు సినిమాల వరకు చేసింది.
అందులో ధనుష్ కి జోడీగా మారి 2 సినిమాలో నటించింది. ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సాయి పల్లవి సాంగ్స్ కి యుట్యూబ్ లో విశేషమైన క్రేజ్ ఉంది. ఆమె నుంచి ఒక పాట వస్తుంది అంటేనే మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. ఇదిలా ఉంటే ఇక ఈ ఏడాదిలో తమిళ్ లో శివ కార్తికేయన్ కి జోడీగా సాయి పల్లవి ఒక సినిమాకి కమిట్ అయ్యింది. ఈ రాజ్ కమల్ బ్యానర్ పై ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించారు.
మావీరన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ కథాంశంతో రాబోతుంది. శివ కార్తికేయన్ నటించిన తెలుగు, తమిళ్ బై లింగ్వల్ మూవీ ప్రిన్స్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని అనుదీప్ కెవి తెరకెక్కించారు. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. ఇక సాయి పల్లవి, శివ కార్తికేయన్ కాంబోలో తెరకెక్కిన సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.