ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ గా ఏ ఒక్కరు కూడా సాయి పల్లవి నటన, డాన్స్ ని మ్యాచ్ చేయలేరనే చెప్పాలి. ఆమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందుకోలేరు. మిగిలిన స్టార్ హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియాలో మిలియన్స్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. హాట్ ఫోటో షూట్ లతో, గ్లామర్ పెర్ఫార్మెన్స్ లతో స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్స్ గా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. అయితే సాయి పల్లవి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు. పెద్దగా ఫాలోవర్స్ లేరు. అలాగే గ్లామర్ షో అస్సలు చేయదు. ఇప్పటి వరకు ఒక్క నాని, సూర్య, ధనుష్ తప్ప చెప్పుకోదగ్గ స్టార్ హీరోలు ఆమె జాబితాలో లేరు.
అయినా కూడా మిగిలిన వారి కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ సాయి పల్లవి సొంతం అని చెప్పాలి. సాయి పల్లవి సినిమా వస్తుంది అంటే హీరోలతో సమానమైన హైప్ ఉంటుంది. మంచి ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. ఆమె సినిమా అంటే కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలాగే ఆమె నటన, డాన్స్ చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే చేసేవి చిన్న సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా సౌత్ ఇండియా ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలలో సాయి పల్లవి ఏకంగా రెండు అవార్డులని సొంతం చేసుకుంది. ఈ వేడుకలలో పుష్ప సినిమా ఆల్ రౌండ్ షోతో మెజారిటీ అవార్డుని సొంతం చేసుకుంది. అయితే బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో శ్యామ్ సింగరాయ్ సినిమాకి గాను సాయి పల్లవి సొంతం చేసుకోవడం విశేషం. అలాగే క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా సాయి పల్లవి సొంతం చేసుకుంది. రష్మిక మందన బెస్ట్ యాక్టర్ కేటగిరీలో పోటీ వచ్చినా కూడా ఆ అవార్డు సాయి పల్లవిని వరించింది అంటే ఆమె శ్యామ్ సింగరాయ్ లో ఏ స్థాయి పెర్ఫార్మెన్స్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.