సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సరికొత్త కథాంశంతో ఈ మూవీ కథని సుకుమార్ సిద్ధం చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా నుంచి ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దివిటీ అడవిలో అక్కడున్న జనానికి ఏదో చెబుతున్నట్లు ఉంది. దీనిని బట్టి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కథ నడుస్తుందని అర్ధమవుతుంది. అలాగే అక్కడ మాస్ జనానికి లీడర్ గా తేజ్ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉంటుందనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.
బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిపి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తేజ్ రోడ్డు ప్రమాదం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని దీపావళి సందర్భంగా రివీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో తేజ్ కి జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ రికమండేషన్ తో ఈ బ్యూటీని తేజ్ కి జోడీగా ఖరారు చేశారని టాక్. దీంతో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ వినోదాయ సిత్తం అనే సినిమాలో చేయనున్నాడు.
ఈ సినిమా షూటింగ్ నవంబర్ ఎండ్ లో కానీ డిసెంబర్ లో కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ చివరిగా రిపబ్లిక్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా కంటెంట్ బాగున్నా కూడా సినిమా చివర్లో తేజ్ క్యారెక్టర్ చనిపోతుంది. దీంతో ప్రేక్షకులు పెద్దగా కంటెంట్ ని కనెక్ట్ కాలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది.