మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సుప్రీం హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఇక చివరిగా తేజ్ రిపబ్లిక్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఇదిలా ఉంటే ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కోమాలోకి వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. చాలా రోజులకి గాని ఆయన తేరుకొని మామూలు మనిషి కాలేదు. ఇక సాయి తేజ్ రోడ్డు ప్రమాదం తర్వాత ఆలోచన దృక్పథంలో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది.
Best Birthday Celebration that I’ll always cherish 😃🤗
Can’t ask for a better and beautiful start than this.
Being in their company & Celebrating with these happy & pure souls felt so peaceful and divine.#Blessed 🙏🏼 pic.twitter.com/8PSlM6ohIc
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 18, 2022
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న అవేర్ నెస్ కార్యక్రామలలో భాగం అయ్యారు. అలాగే ఎక్కువగా ఇంటి దగ్గరే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. వీలైనంత తక్కువగా తేజ్ మీడియా దృష్టిలో పడకుండా తన పని తాను చూసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదం తర్వాత సాయి తేజ్ జరుపుకుంటున్న పుట్టిన రోజు వేడుకలని ఆయన పార్టీలా పెద్దగా సెలబ్రేట్ చేసుకోకుండా సరికొత్తగా చేసుకున్నారు. అనాధ పిల్లలతో కలిసి తేజ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారందరిని ఒక గ్రాండ్ గా భోజనాలు పెట్టింది. వారిని ఒక గేమ్ జోన్ కి తీసుకెళ్లి అక్కడ వారిని ఆడిస్తూ, వారితో ఆడుకుంటూ అందులో సంతోషాన్ని వెతుక్కున్నారు. అలాగే వారందరితో కలిసి కేక్ కటింగ్ చేసి ఫోటోలు తీసుకున్నారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.