Sai Dharam : రేపు అంటే ఆగస్టు 22న అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది పుట్టినరోజుకు ఒకరోజు ముందే మెగాస్టార్ బర్త్‌డే సందడి స్టార్ట్ అయిపోయింది. దీనిలో భాగంగా హైటెక్స్‌లో కార్నివాల్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ప్రతిసారి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో చిరు పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు కానీ ఈ ఏడాది హైటెక్స్‌లో నిర్వహిస్తున్నారు. ఒక జాతరగా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్నివాల్‌కు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, సాయి ధరమ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్నివాల్‌కు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ముందుగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘అన్నయ్య ఇంత సాధించినా ఆయనను ఎందుకు విమర్శిస్తారో.. ఎందుకు అన్యాయంగా మాట్లాడతారో.. మీడియా, ప్రెస్‌మీట్ సంస్థలు ఎందుకు విమర్శిస్తాయో నాకర్ధం కాదు. చిరంజీవిగారు మంచి వ్యక్తి కాకుంటే నేను పట్టించుకోను. ఆయనను ఎవరైనా విమర్శించినా.. పవన్‌ను ఎవరైనా విమర్శించినా నేను ఊరుకోను. దానికి నన్ను కాంట్రవర్షియల్ పర్సన్ అని అంటారు. అయినా సరే.. నా అన్నని, నా తమ్మున్ని ఎవరైనా విమర్శిస్తే తాటతీస్తా. ఒక మీడియా సంస్థ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ కరెక్ట్ కాదు.. వాడొక దొంగ. అని చెప్పి ఒక వార్త.. గవర్నమెంట్ స్పాన్సర్డ మ్యాగజైన్ ఒకటుండి. వాడు.. వాడికి గౌరవం కూడా ఇవ్వను. వాడు చిరు, పవన్ గురించి ఎప్పుడూ ఏదో ఒకటి రాయాలి. చెప్పకుంటే తోయదు. కానీ ఎంతమంది ఎన్ని దారుణమైన మాటలు.. ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ గురించి ఎన్ని మాటలన్నా సరే పట్టించుకోకుండా బ్లడ్ బ్యాంక్ స్థాపించాడు. ఎంతో మందికి రక్త, నేత్ర దానం చేశాడు. త్వరలోనే కొందరి కోసం ఆస్పత్రి కట్టబోతున్నాడు. మరి ఇంక ఏం చేయాలని ఆశిస్తారో నాకర్ధం కావడం లేదు’’ అని పేర్కొన్నారు.
Sai Dharam : అన్నం ముద్ద నా నోట్లోకి వెళుతోందంటే..
ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘‘మిమ్మల్నందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ నాకు జరిగిన యాక్సిడెంట్‌కు నేను ఇలా రాగలుగుతాననేది నాకు తెలియలే. మిమ్మల్నందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ పక్కనబెడితే ఇవాళొక పండగ. ఆగస్ట్ 22 నా చిన్నప్పటి నుంచి ఒక పెద్ద పండుగ. నా గురించి వీడు సుప్రీం హీరో ఏంటిరా? అని మీకు అనిపించవచ్చు. మూడో సినిమాకే వీడికి సుప్రీం హీరో అని వచ్చేసిందా? మరి చెప్తాడురా వీడు అని మీకందరికీ అనిపించవచ్చు. కానీ దానికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. ఈ ఐదు వేళ్లు అన్నం ముద్ద కలిపి నా నోట్లోకి వెళుతోందంటే దానికి కారణం మా మామయ్య చిరంజీవి గారు. ఎంత ఎత్తుకు వెళ్లినా మా మామయ్య నాతో ఉంటారని.. ఆయన పేరు నాతో ఉండాలని ఒక కోరిక. అందుకే నేను పెట్టుకున్నా ఆ పేరు. మీ అందరి తరుఫున, నా తరుఫున హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారూ’’ అని సాయి ధరమ్ పేర్కొన్నాడు.