Sadha: హీరోయిన్ సదా అందరికీ సుపరిచితురాలే. దర్శకుడు తేజ తెరకెక్కించిన “జయం” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సదా.. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది.
ఆ తర్వాత తెలుగుతో పాటు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోల సరసన నటించడం జరిగింది.
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన “అపరిచితుడు”లో సదా నటన చాలా అద్భుతంగా ఉంటుంది. మొదట్లో వరుస విజయాలు చూసిన సదా తర్వాత పరాజయాలు పలకరించడంతో.. సైలెంట్ అయిపోయింది.
అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా.. తర్వాత బుల్లితెరపై రాణించింది. ఈటీవీలో ప్రముఖ డాన్స్ షో “డీ” లో జడ్జిగా కూడా చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో లేటెస్ట్ గా ఓటీటీలో “హలో వరల్డ్” లో ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది.
సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగానే స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న సదా ముందుగా సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పరచుకోవడానికి రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంది.
తాజాగా బ్లూ చీరలో నడుము అందాలు చూపిస్తూ.. సదా పోస్ట్ చేసిన ఫోటోలకు కుర్ర కారు ఫిదా అవుతున్నారు. గత కొద్ది నెలలుగా ఇంస్టాగ్రామ్ లో ట్రెడిషనల్ లుక్ లో సదా.. దర్శనమిస్తూ కుర్రాళ్ళు ఆటెన్షన్ క్యాచ్ చేస్తుంది.
సినిమాలపరంగా జోరు తగ్గినా గాని సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ.. అడపా దడపా గ్లామర్ షోలతో మతిపోగోడుతోంది.
తాజాగా బ్లూ ట్రాన్స్ ఫరెమంట్ శారీలో నడుము చూపిస్తూ.. సదా దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ట్రెడిషనల్ లుక్ లో గ్లామర్ చూపిస్తూ సదా చీరకే అందం తెచ్చినట్టు చిరునవ్వు ఇచ్చింది.
ఈ ఫోటోలకు కుర్ర కారు భారీ ఎత్తున లైకులు కొట్టడం మాత్రమే కాదు కామెంట్లు పెడుతున్నారు.