సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో శివ నిర్వాణ ఒక సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్యూర్ లవ్ స్టోరీగా ఎమోషనల్ డ్రామాతో ఈ కంటెంట్ ని దర్శకుడు శివ నిర్వాణ చెప్పబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ కాస్తా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లడం, సమంత కూడా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం విదేశాలకి వెళ్లడంతో ఖుషి మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే వీరిద్దరూ షూటింగ్ లో జాయిన్ కావడానికి ఒకే చెప్పడంతో దర్శకుడు కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
సినిమాలో విజయ్, సమంత ప్రేమకథ విషాదంగా ముగుస్తుందని టాక్. అయితే విషాదంతో ముగిసే ప్రేమకథలని తెలుగు ప్రేక్షకులు అంతగా డైజిస్ట్ చేసుకోరు. ఈ కారణంగా సినిమా ఆరంభంలోనే క్లైమాక్స్ కి సంబందించిన ఎపిసోడ్ ని చూపించి తరువాత ఫ్లాష్ బ్యాక్ తో కథని చెప్పే ప్రయత్నం శివ నిర్వాణ చేయబోతున్నాడని టాక్. ఇలా చేస్తే ఆడియన్స్ ముందుగానే ముగింపుకి కనెక్ట్ అయ్యి అసలు స్టోరీ ట్రావెలింగ్ ని చూస్తారని దర్శకుడు భావిస్తున్నట్లు టాక్.
ఆ కంటెంట్ ని ప్రేక్షకులకి నచ్చే నేవిధంగా చెబితే సినిమా హిట్ అవుతుందనే భావనతో శివ ఇలా వర్క్ అవుట్ చేస్తున్నాడని తెలుస్తుంది. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా కూడా ఇంచుమించు ఇదే విధంగా వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. లెఫ్టనెంట్ రామ్ లేడనే విషయాన్ని ముందుగానే కథలో ప్రేక్షకుడికి అర్ధమయ్యే విధంగా కథని ఆరంభించి ఇంటరెస్టింగ్ గా క్లైమాక్స్ కి ముగింపు ఇచ్చారు. ఈ కారణంగానే సినిమాని ఆడియన్స్ చనిపోయిన లెఫ్టనెంట్ రామ్ కథగానే చూడటం మొదలు పెట్టారు. ఎమోషనల్ గా స్టోరీకి కనెక్ట్ అయ్యారు. సినిమాని సూపర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఖుషి సినిమాని కూడా అలాగే చెబితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని శివ నిర్వాణ ఆలోచించి నేరేషన్ ని సీతారామం తరహాలోనే ప్లాన్ చేస్తున్నట్లు టాక్.