Saara Ali Khan : సారా అలీ ఖాన్ స్టైలిష్ అవుట్ ఫిట్‌లతో అద్భుతమైన ఫోటో షూట్ లు చేస్తూ అభిమానులను ట్రీట్ చేయడంలో ఎటువంటి రాజీ పడదు. తాజాగా ఈ చిన్నది చేసిన హాట్ ఫోటోషూట్ నుంచి స్టిల్స్‌ను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. బ్లాక్ టాప్ , రెడ్ కలర్ థై హై స్లిట్ తో వచ్చిన స్కర్ట్ ధరించి తన హాట్ హాట్ అందాలతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది.

Saara Ali Khan : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్టార్స్‌లో సారా అలీఖాన్ ముందు వరుసలో ఉంటుంది. ఈ భామ చేసింది నాలుగైదు సినిమాలే అయినా అమేజింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిని ఇంప్రెస్ చేసేందుకు ఈ బ్యూటీ వీలుచిక్కినప్పుడల్లా తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో పాటు ప్రొఫెషనల్ స్టిల్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది.

తాజాగా సారా అలీఖాన్ తన ఇన్ స్టా ఫ్యామిలీకి లేటెస్ట్ అవుట్‌ఫిట్‌తో ఫోటో షూట్ చేసి ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ కింద స్మగ్ యాజ్ ఏ లేడీ బగ్ అని క్యాప్షన్‌ను జోడించింది.

సారా అలీ ఖాన్ ప్రస్తుతం తన తల్లి అమృతా సింగ్ తో పాటు ఆమె బృందంతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి హాజరయ్యేందుకు గోవా వెళ్లిన ఈ బ్యూటీ తన గోవా ట్రిప్ నుండి క్రేజీ చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక్కొక్కటి షేర్ చేస్తోంది.

సారా రీసెంట్‌గా వరుణ్ ధావన్‌తో కలిసి బీచ్‌లో సమయాన్ని ఆస్వాదిస్తున్న పిక్స్‌ను నెట్టింట్లో పోస్ట్ చేసింది. అలాగే తన తల్లి టీమ్ తో కలిసి బీచ్ రిసార్ట్‌లో డైన్ చేస్తున్న పిక్స్‌ను పంచుకుంది.

ఈ రెడ్ అండ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్ గా కనిపించింది సారా. బ్లాక్ స్ట్రాప్స్‌తో వచ్చిన టైట్‌ఫిట్ టాప్ వేసుకుని దానికి మ్యాచింగ్‌గా బాడీ హగ్గింగ్ స్కర్ట్ ను ధరించింది ఈ బ్యూటీ. తన కురులతో అందమైన జడను అల్లుకుంది. కనులకు వింగెడ్ ఐ లైనర్, మస్కరా వేసుకుని ఐబ్రోస్‌ను డార్క్ చేసుకుంది ఈ బ్యూటీ పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్‌తో అందరిని మెస్మరైజ్ చేసింది. అవుట్‌డోర్‌లో చేసిన ఈ పిక్స్‌లో బోల్డ్ ఫోటో షూట్ చేసి ఫ్యాన్స్‌ను అవాక్కు చేసింది. సారా ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా పాదాలకు టై అప్ హీల్స్‌ను వేసుకుంది. ఎలాంటి ఆభరణాలు వేసుకోకున్నా అందమంతా ఈ భామ సొంతమైంది.
