S.S.Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి భారతీయ సినిమా డైనమిక్స్ ను మార్చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మగధీర , ఈగ, మర్యాద రామన్న, బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి తనదైన మార్క్ ని ఇండస్ట్రీలో స్ప్రెడ్ చేశారు రాజమౌళి. ఈ స్టార్ డైరెక్టర్ నుంచి ఏదైనా మూవీ అనౌన్స్ మెంట్ వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో ఆ టాపిక్ సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది . రాజమౌళి చిత్రాలు తీసే పద్ధతే కాదు ఆయన మాటల్లోని అర్థాలు కూడా చాలామందికి అంత ఈజీ గా అర్థం కావు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సిద్ధాంతాన్ని నమ్ముకుని తెలుగు పరిశ్రమలో రాణిస్తున్నారు రాజమౌళి. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది తాజాగా ఆయన చేసిన ఓ కామెంట్.

S.S.Rajamouli : ఇటీవల టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరైన ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ , మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మూవీకి వచ్చిన ఆదరణ గురించి ఆయన మీడియాతో ప్రస్తావన తీసుకొచ్చారు. పాన్ ఇండియా సినిమాలు తీసే డైరెక్టర్ అయినా తన గురించి చాలా సింపుల్ గా ఒకే ఒక్క మాటలో తేల్చేసి చెప్పాడు. నిజానికి తనకి ఏమీ రాదని , ఇండస్ట్రీలో స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నానని , ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఒక స్టార్ డైరెక్టర్ ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రతి అంశం లోనూ కొత్త విషయాలను తెలుసుకోవడంలో తాన్నెప్పుడూ ఆసక్తి చూపుతాను అంటున్నారు.

S.S.Rajamouli : ఇదే క్రమంలో తాను మూవిస్ తీసే స్టైల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు జక్కన్న. ఆర్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తో మరో ప్రాజెక్టు లో మునిగిపోయారు రాజమౌళి . ఇదివరకే మహేష్ బాబుతో తాను మూవీ చేస్తున్నట్లు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు రాజమౌళి. పాన్ ఇండియా లెవెల్ లో మహేష్ తో సినిమా తీయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది . ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2023లో ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.