వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి బోలెడు సినిమాలు సిద్ధమయ్యాయి కానీ బాక్స్ ఆఫీస్ రేసులో రామ్ చరణ్,ఎన్టీఆర్,ప్రభాస్,పవన్,మహేష్ లు ఉండడంతో వారంతా వెనక్కి తగ్గారు. ఆర్.ఆర్.ఆర్ మూవీకి లైన్ క్లియర్ చేయడం కోసం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట మూవీ రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు.ఇక ముందు అనౌన్స్ చేసిన డేట్ కే రావాలని పట్టుపట్టిన భీమ్లా నాయక్ మూవీ యూనిట్ ను కన్విన్స్ చేయడానికి సినీ పెద్దలు రంగంలోకి దిగారు తాజాగా వారి అభ్యర్ధనల కొరకు భీమ్లా నాయక్ మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్లు ప్రకటించింది.దీంతో ఆర్.ఆర్.ఆర్,రాధే శ్యామ్ మూవీస్ కు లైన్ క్లియర్ అయిందని అందరూ అనుకున్నారు కానీ మరో స్టార్ హీరో తన మూవీతో వీరికి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ ప్రచారం జరుగుతుంది మరి ఆ హీరో ఎవరో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గత మూడు నెలలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు మూవీ చేశారు.ఈ మూవీలో నాగార్జున సరసన రమ్యకృష్ణ,నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ముందు సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమైన ఈ మూవీ పండగ రేసులో పోటీ ఎక్కువ ఉండడంతో రిలీజ్ వాయిదా వేయాలనుకుంది కానీ ఇప్పుడు పండగ రేసులో పోటీ తక్కువ ఉండడంతో ఆ రేసులోకి తాము ఎంటర్ అవ్వాలని బంగార్రాజు చిత్ర యూనిట్ భావిస్తుందని సమాచారం.