రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ మూవీలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లీడ్ రోల్స్ కనిపిస్తుండగా,శ్రియ,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చిత్ర యూనిట్ దుబాయ్ లో నిర్వహించాలనే ప్లాన్ లో ఉంది.బాలీవుడ్ మార్కెట్ ను దృష్ఠిలో పెట్టుకొని చిత్ర యూనిట్ ఈ వేడుకకు బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 5వ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేయబోతుంది.ఈ ట్రైలర్ లో అన్ని ఎమోషన్స్ ను నింపి సినీ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.