వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూవీ టికెట్స్ ను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వం 5,10,30 రూపాయిల టికెట్లు థియేటర్స్ ఉండాలనే నిబంధన పెట్టింది.దీన్ని పాటించని థియేటర్ యాజమాన్యాల పట్ల చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది.దీంతో అసలు ఈ గొడవంతా ఎందుకని చాలా చోట్ల థియేటర్ యజమానులు థియేటర్ లకు తాళాలు వేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్ని వినతులు వస్తున్న,సినీ పెద్దలు కలిసి ఎన్ని చెబుతున్న వెనక్కి తగ్గట్లేదు.కోర్టులో ఇండస్ట్రీకి అనుకూలంగా తీర్పు వచ్చిన వేరే బెంచ్ లను ప్రభుత్వం ఆశ్రయిస్తుంది.దీంతో భారీ ఆదాయం వచ్చే ఆంధ్రప్రదేశ్ నుండి ఇక ఆదాయం రావడం చాలా కష్టమవుతుంది.దీంతో పాన్ ఇండియా మూవీ లాంటి ఆర్.ఆర్.ఆర్ కు,రాధే శ్యామ్ మేకర్స్ మూవీ రిలీజ్ చేయాలా వద్దా అనే డైలమాలో పడ్డారు