రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోలుగా కొనసాగుతున్న ఎన్టీఆర్,రామ్ చరణ్ లు కలిసి నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్.ఈ మూవీలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్‌గా కనిపిస్తుండగా,రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లాగా కనిపిస్తున్నాడు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ అయిన ట్రైలర్ లో విజువల్స్ సినీ అభిమానులకు థియేటర్స్ లో ఫీస్ట్ ను రుచి చూపించబోతుందని అర్థమవుతుంది.ట్రైలర్ లో ఎన్టీఆర్ పులి ముందే అరిచే సీన్,రామ్ చరణ్ ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’ అని చెప్పే డైలాగ్ సినీ అభిమానులను అలరిస్తున్నాయి.
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్,రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్,శ్రియ ఈ మూవీలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.అన్ని భాషలలో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ తాజాగా 100 మిలియన్ వ్యూస్ ను దాటి సరికొత్త రికార్డ్ నిలిపింది.తెలుగులో 40 మిలియన్ వ్యూస్‌కు చెరువులో ఉన్న ఈ ట్రైలర్ హిందీలో 50 మిలియన్ వ్యూస్,తమిళ్ లో 6.6 మిలియన్ వ్యూస్,కన్నడలో 7 మిలియన్ వ్యూస్,మలయాళంలో 3.4 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రేసులో భారీగా వసూలు చేయడానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.రిలీజ్ కు ముందే రోజుకో రికార్డ్ కొల్లగొడుతున్న ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎన్ని రికార్డ్స్ ను తాను పేరున సృష్టిస్తుందో వేచి చూడాలి.