రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదల కానున్నది.దీంతో చిత్ర యూనిట్ పూర్తిగా మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది.ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించి అలరించబోతుంది.ఈ మూవీలో అజయ్ దేవగన్, శ్రీయ శరణ్, సముద్రఖని వంటి తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ హిందీ డిస్ట్రిబ్యూటర్లు మూవీలో చరణ్,ఆలియా భట్ సరసన ఒక సాంగ్ పెట్టాలని కోరారట.దానికి దర్శకుడు రాజమౌళి ఒకే అన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.మరి ఇందులో నిజమెంతో తెలియాల్సివుంది