రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక ఓటీటీలో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక హాలీవుడ్ టెక్నిషియన్స్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్, రామ్ చరణ్, తారక్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీ ఆస్కార్ నామినేషన్స్ లో పోటీ పడుతుంది.
కచ్చితంగా ఏదో ఒక కేటగిరీలో ఈ మూవీకి ఆస్కార్ వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీని తాజాగా జపాన్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ వర్క్ లో రామ్ చరణ్, తారక్, రాజమౌళి జపాన్ వెళ్లి అక్కడ పార్టిసిపేట్ చేశారు. అక్కడి అభిమానులతో ముచ్చటించారు. సినిమాకి ఫుల్ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమా జపనీస్ బాషలో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇక మొదటి రోజు సినిమాకి ఏకంగా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఏడాది తర్వాత కూడా ఈ సినిమాని జపనీస్ ప్రజలు సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడుతున్నారు అని ఈ కలెక్షన్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. రాజమౌళి బాహుబలి2కి కూడా జపాన్, చైనాలలో భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా అదే స్థాయిలో జపాన్ ప్రేక్షకుల నుంచి ఆదరణ లబిస్తుంది. నేటివిటీ మిస్ అయిన కంటెంట్ లో ఎమోషన్ కి ఆడియన్స్ భాగా కనెక్ట్ అవుతున్నారు.