మూవీ ప్రమోషన్స్ లో మన తెలుగు దర్శకల స్టైల్ వేరు.ప్రస్తుతం కొత్తగా,ఆసక్తిగా మూవీని ప్రమోట్ చేసే విషయంలో రాజమౌళి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.తాజాగా ఈయన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్.ఆర్.ఆర్ మూవీ చేశారు.ఈ మూవీ ప్రమోషన్ కోసం ఒక్కొక స్టేట్ లో ఒక్కొక స్ట్రాటజిని అనుసరిస్తున్నారు.ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కు భారత చిత్ర పరిశ్రమకు 40 శాతం ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న బాలీవుడ్ అవసరం ఉందని గ్రహించిన రాజమౌళి మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్,బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ కు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించిన చిత్ర యూనిట్ బి టౌన్ లో జరగనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.ముంబై ఫిల్మ్ సిటీలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ రెండు ప్రత్యేక రైళ్లను బుక్ చేశారు.ఈ రెండు ట్రైన్స్ లో మొత్తం 3000 మందిని ముంబై ఫిల్మ్ సిటీకి చిత్ర యూనిట్ తీసుకొని వెళ్తుంది.ఈ ట్రైన్స్ లో వెళ్లేవారికి చిత్ర యూనిట్ సకల సౌకర్యాలను అందివ్వనున్నది.వీరిలో 1500 మంది ఎన్టీఆర్ అభిమానుల కాగా మరో 1500 చరణ్ అభిమానులు.ఈ ట్రైన్స్ లో ఒకటి కర్నూల్ నుండి మరొకటి విజయవాడ నుండి ప్రారంభం కానున్నది.మొత్తం మూడు స్టాప్ లతో మొదలుకానున్న ఈ ట్రైన్స్ లోకి అభిమానులు తప్ప మరెవ్వరూ ఎంటర్ కాలేరు.ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని కొత్త తరహా ప్రమోషన్ ను చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ముంబైలో జరగనున్న ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు.