రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ మూవీలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లీడ్ రోల్స్ కనిపిస్తుండగా,శ్రియ,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.డిసెంబర్ 3వ తేదీన రావాల్సిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా వాయిదా పడింది.త్వరలో ఈ మూవీ ట్రైలర్ కొత్త డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనున్నది.
ప్రస్తుతం చిత్ర యూనిట్ రిలీజ్ కు సిద్ధం చేసిన ట్రైలర్ లోని కొన్ని సీన్స్ వాటి డిఐ వర్క్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన రాజమౌళి ట్రైలర్ ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.ఈ తాజా అప్డేట్ విన్న మెగా అభిమానులు,నందుమూరి అభిమానులు ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు.