రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ మూవీలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లీడ్ రోల్స్ కనిపిస్తుండగా,శ్రియ,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించిన చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్,రామ్ చరణ్ ల నుండి రెండు నెలలు సమయం తీసుకున్నారు.
తాజాగా ఈ మూవీ నుండి చిత్ర యూనిట్ ఒక అప్డేట్ విడుదల చేసింది.ఈ మూవీలో జనని అనే ఎమోషనల్ మెలోడీ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రేపు విడుదల చేయబోతుంది.ఈ పాటలో మూవీలో కీలక పాత్రలు పోషించిన అందరూ కనిపించి కనువిందు చేయనున్నారు.ఈ సాంగ్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ శ్రియతో డైలాగ్ చెప్పే విజువల్స్ కూడా ఉండబోతున్నాయని సమాచారం.