రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ మూవీలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లీడ్ రోల్స్ కనిపిస్తుండగా,శ్రియ,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చిత్ర యూనిట్ దుబాయ్ లో నిర్వహించనుంది.ఈ వేడుకకు బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.బాలీవుడ్ మార్కెట్ ను దృష్ఠిలో పెట్టుకొని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించిన చిత్ర యూనిట్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లను వీటిలో చురుక్కుగా పాల్గొనడానికి రెండు నెలలు సమయం కేటాయించాలని కోరింది.దానికి వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్,ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.