RRR Golden Globe : స్టార్ డైరెక్టర్ రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ చిత్రం ఆర్ఆర్ఆర్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గ్లోబల్ ఈవెంట్‌లో చారిత్రాత్మక విజయాన్ని చూసి గర్విస్తున్నారు.వారి విజయాన్ని తమ విజయంగా సంబరాలు చేసుకుంటున్నారు. చాలా మంది అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి , టీమ్ RRRని అభినందించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వెళుతున్నారు.

ట్విట్టర్లో RRRని ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచేస్తున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీల నుంచి స్టార్ హీరోల వరకు, రాజకీయ నేతల నుండి పీఎం వరకు అందరూ ఆర్ ఆర్ ఆర్ టీమ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనింగ్ బ్యాస్ మెన్ డేవిడ్ వార్నర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లోకి వెళ్లి 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ట్రోఫీని గెలుచుకున్నందుకు ‘RRR’ టీమ్‌ను అభినందించాడు. చిత్రనిర్మాత రాజమౌళికి విషెస్ తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున టీమ్ ను కంగ్రాట్యులేట్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ఆర్ఆర్ భారీ విజయానికి జట్టును అభినందించింది. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సిఎం భగవంత్ మాన్ నాటు నాటుకు ‘డ్యాన్స్’ చేసిన వీడియోను తమ ట్విట్టర్ అకౌంట్ లో వారు పంచుకున్నారు.

ప్రిన్స్ మహేష్ బాబు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు కంగ్రాట్యులేషన్ తెలిపారు .ఈ విజయాన్ని చూసి ఎంతో గర్వాంగా ఉందంటూ ట్వీట్ చేసారు.
Advertisement