రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్,చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.బాలీవుడ్ బడా హీరో అజయ్ దేవగన్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నాని ఏ సినిమాను ప్రత్యేకంగా చూడబోమని తెలపడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీని ముందుగా అనుకున్న దానికంటే సగం రేట్ కు ఇవ్వాలని లేకుంటే తాము నష్టపోతామని మూవీ మేకర్స్ ను కోరుతున్నారని సమాచారం.ఒకవేళ ఇది నిజమైతే ఆర్.ఆర్.ఆర్ మూవీ మేకర్స్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ కానున్నది.