RP Patnayak : రెబల్ స్టార్ కృష్ణం రాజు అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్య సమస్యతో కొద్ది రోజులుగా బాధ పడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో కృష్ణం రాజు తొలుత ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడిన కృష్ణంరాజు నేటి తెల్లవారు జామున గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలోలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం సడెన్‌గా ఆయన మరణించారన్న వార్త బయటకు రావడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కృష్ణంరాజు మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ వీడియోలను విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ స్పందించారు. ఉదయం లేవగానే విషయం తెలిసిందని.. చాలా బాధేసిందంటూ చెప్పుకొచ్చారు. తాము బంజారాహిల్స్‌లో ఉన్నప్పుడు తమ అపోజిట్ హౌస్‌లో కృష్ణంరాజు ఉండేవారని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ తొలి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నానని ఆ సమయంలో మ్యూజిక్ బాగా రావాలని తనకు చెప్పారని ఇంకా ఆర్పీ పట్నాయక్ పలు విషయాలను ఆ వీడియో ద్వారా పంచుకున్నారు.
RP Patnayak : ఆయన చేత్తో ఇచ్చిన మెడిసిన్‌తో ఎంతో మంది క్యూర్ అయ్యారు
‘‘ఉదయం లేవడంతోనే బరువెక్కిన గుండెతో కృష్ణంరాజు గారు లేరనే వార్త తెలుసుకున్నాను. చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఆయన ఎవర్ని కలిసినా ఎప్పుడు కలిసినా చాలా నవ్వుతూ నా మనిషి అన్నట్టుగానే పలకరిస్తారు. నా మనిషి అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు. ఆయన చాలా ఆత్మీయంగా పలకరిస్తారు. నేను బంజారాహిల్స్‌లో ఉన్నప్పుడు ఆయన మా అపోజిట్ ఇంట్లో ఉండేవారు. రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. మాట్లాడేవాళ్లం. అన్నింటికీ మించి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా ఫ్యామిలీపై ఉండేది. ప్రభాస్ ఫస్ట్ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్న సమయంలో మా వాడికి చాలా పెద్ద మ్యూజిక్ ఇవ్వాలి ఆర్పీ అనేవారు. అలాగే ఆ సినిమా చాలా పెద్ద మ్యూజికల్ హిట్ అయ్యింది. ఆయన పాజిటివ్ యాటిట్యూడ్‌కి ఇవన్నీ నిదర్శనం. చాలా మందికి తెలియదు. ఆయన జాండిస్ వచ్చిన వారికి మెడిసిన్ ఇచ్చేవారు. ఆయన చేత్తో ఇచ్చిన మెడిసిన్‌తో ఎంతో మంది క్యూర్ అయ్యారు. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తూ సొంత మనిషిలా బిహేవ్ చేస్తారు. కృష్ణంరాజు గారు మన మధ్య లేరు అన్న విషయం చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’అని ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు.