సంగీత దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆర్పీ పట్నాయక్ తరువాత దర్శకుడుగా మారి సినిమాలు తెరకెక్కించారు. అందులో ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్రోకర్ సినిమా మంచి హిట్ అయ్యింది. అందమైన మనసులో అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేశారు. తరువాత బ్రోకర్ సినిమా చేశారు. అది మంచి హిట్ అయ్యింది. ఆ తరువాత ఫ్రెండ్స్ బుక్ పెద్దగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ లో అమీ అనే సినిమాని తెరకెక్కించారు.
అలాగే కన్నడంలో ప్రియమణి లీడ్ రోల్ లో వ్యూహ అనే సినిమా చేశారు. అయన చివరిగా 2016లో మనలో ఒకడు సినిమాతో వచ్చారు. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరల 6 ఏళ్ల తర్వాత దర్శకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాఫీ విత్ కిల్లర్ అనే సినిమాతో క్రైమ్ అండ్ కామెడీ కథతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓటీటీ కోసం చేసిన సినిమా అని తెలుస్తుంది. బ్లాక్ కామెడీ జోనర్ లో ఈ మూవీ ఉండబోతుందని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ బట్టి అర్ధమవుతుంది.
ఓ కాఫీ షాప్ లో జరిగే కథగా దీనిని దర్శకుడు ఆవిష్కరించారు. ఈ మూవీతో ఆర్పీ పట్నాయక్ ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తాడు అనేది చూడాలి. ఇక సంగీత దర్శకుడిగా కూడా సుదీర్ఘకాలం గ్యాప్ తర్వాత మరల అహింస అనే మూవీతో ఆర్పీ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటు దర్శకుడిగా, అటు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ ఏడాది ఆర్పీ టాలీవుడ్ లో మళ్ళీ బూస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మరి దర్శకుడిగా ఈ సారి ఆర్పీ చేసిన కొత్త ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.