Romance Tips: రిలేషన్ షిప్ మీద ఎక్కువగా ప్రభావం చూపించే విషయాల్లో రొమాన్స్ కూడా ఒకటి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే రొమాన్స్ వల్ల రిలేషన్ షిప్ ఎఫెక్ట్ అవుతుందని చాలామంది మానసిక నిపుణులు చెబుతుంటారు. అందుకే ఆడవారైనా, మగవారైనా రొమాన్స్ విషయంలో బాగా ఉండాలని సలహా ఇస్తుంటారు. చాలామంది ఆడవాళ్లు రొమాన్స్ లో చేసే తప్పుల వల్ల రిలేషన్ షిప్ ప్రభావం అవుతుంది. ఇలా ఆడవాళ్లు చేసే తప్పులు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ఎక్కడ సిగ్గుపడాలో అక్కడే సిగ్గు పడండి:
ఆడవారికి సిగ్గు అందం అని అందరికీ తెలుసు. కానీ తమకు నచ్చిన పార్ట్ నర్ తో రొమాన్స్ చేస్తున్నప్పుడు సిగ్గు పడకూడదు. ఇలా సిగ్గు పడితే అవతల ఉండే వ్యక్తి కాస్త ఇబ్బందిగానూ, ఆడవారికి ఇష్టం లేదేమో అనే భావనలోకి వస్తాడు. కాబట్టి ఇది రిలేషన్ షిప్ ను ప్రభావితం చేస్తుంది.
లోపాలున్నా పర్లేదు:
ఆడవారి విషయంలో మగవారు కొన్ని అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది రకరకాల లోపాలతో బాధపడుతూ ఉంటారు. ఆడవారిగా రొమాన్స్ చేసే సమయంలో వాటి గురించి మాట్లాడకపోవడం ఉత్తమం. వారిని ఎంతో సంతోషంగా పెట్టడంతో పాటు వారిలో ధైర్యం వచ్చేలా ప్రవర్తించండి.
Romance Tips : అతిగా ఆలోచించకండి:
రిలేషన్ షిప్ లో అతిగా ఆలోచించడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. మరీ ముఖ్యంగా రొమాన్స్ చేస్తున్న సమయంలో దేని గురించి ఆలోచించకూడదు అని గుర్తించుకోండి. మీ పార్ట్ నర్ మీతో ఉన్నప్పుడు అతిగా ఆలోచిస్తే అది మీ రిలేషన్ ని ప్రభావం చేస్తుంది.