Roja: ఏపీలో మూడు రాజధానుల విషయంలో రాజకీయ దుమారం చెలరోగుతోంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే మూడు రాజధానుల వ్యవహారాన్ని సీన్‌లోకి తెచ్చారని టీడీపి విమర్శలు గుప్పతిస్తుంది. వైసీపీ కూడా అదేరీతిలో కౌంటర్ ఎటాక్‌కు దిగింది. ఈ క్రమంలో అధికార పార్టీ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన మంత్రి రోజా కూడా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విఐపి విరామ సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకున్న తరువాత ఆమె మీడియాతో ముచ్చటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలను అభివృద్ధి చేసేందుకు పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని ఆమె తెలిపారు. 58 ఏళ్ల ముందే రాయలసీమకు రాజధాని రావాల్సినా అప్పుడు రాలేదని, దాదాపు 5 దశాబ్ధాల తరువాత రాజధాని రావడంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుందని ఆమె తెలిపారు. రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతానికి న్యాయరాజధాని రావాలని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే అప్పట్లో విశాఖపట్నంను రాజధానిగా చెయ్యాలని పుచ్చలపల్లి సుందరయ్యగారు ప్రయత్నించినా అది జరగలేదని దానిని సీఎం జగన్ సాధించారని ఆమె చెప్పకొచ్చారు.
బినామీలతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు
రాయలసీమవాసిగా ఈ ప్రాంతానికి రాజధాని వస్తుంటే ఆనందించాల్సిన చంద్రబాబు ఎక్కడ అమరావతిలో తన బినామీలు చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు గండి పడుతుందేమోనని భయపడుతున్నరని ఆమె ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు వైసీపీకి పట్టంగట్టారని ఆమె తెలిపారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లతో అమరావతి ఉద్యమాన్ని నడిపి చంద్రబాబు నీచరాజకీయాలకు తెరలేపారని ఆమె మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని ఏర్పాటు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి మద్దతుగా చేపడుతున్న ఉత్తరాంధ్ర సంఘీభావ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు పవన్‌ను రంగంలోకి దింపి ఆయనతో మూడు రోజుల కార్యక్రమం ప్లాన్ చేశారని ఆమె దుయ్యబట్టారు. ఎన్నో పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్‌కు ఉత్తరాంధ్ర, రాయలసీమవాసుల కష్టాలు తెలిపే పుస్తకాలు కనిపించలేదా అని ఆమె పవన్‌ను విమర్శించారు.
Roja:
అలాగే అన్‌స్టాపబుల్ షోలో బావబామ్మర్దులు అబ్బద్దాలు బాగా చెప్పారని, ఎన్టీఆర్‌ను పదవి కోసం వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని ఆయను తీవ్ర శోకాన్ని మిగిల్చారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని ఏడ్చానని చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్టీఆర్‌ను తన ఆరాధ్య దైవంగా చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరించి ఆయనను పార్టీ ఆఫీసు నుండి వెళ్లగొట్టారని ఆమె ఆరోపించారు. కుప్పం ప్రజలను సైతం చంద్రబాబు మోసం చేశారని ఆమె అన్నారు. పరిపాలనా రాజధాని, న్యాయ రాజధానులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె దుయ్యబట్టారు.