Roja Daughter: ఆర్కే రోజా ప్రస్తుతం రాజకీయంగా ఫైర్ బ్రాండ్‌గా రాణిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా మంచి హిట్లు అందుకున్న రోజా.. తర్వాత రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. మొదట్లో ఐరన్ లెగ్ అనే విమర్శలు ఎదుర్కొన్నా తర్వాత నిలదొక్కుకొని ఎమ్మెల్యేగా గెలుపొందింది. ప్రస్తుతం మంత్రి కూడా అయ్యారు రోజా. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కుమారుడు, కుమార్తె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు రోజా. కార్తీకమాసం సందర్భంగా తిరుమల రావడం, తన పుట్టినరోజు సందర్భంగా స్వామి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని రోజా తెలిపారు. తాను తిరుపతి ప్రాంతంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
రాజకీయాల్లో శత్రువులను ఎదుర్కొనే శక్తి స్వామివారు ఇవ్వాలని కోరుకున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఇక తన కూతురు, కుమారుడి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీపై మాట్లాడుతూ.. తన కుమార్తె, కొడుకు యాక్టింగ్ చేయడానికి ఇండస్ట్రీలోకి వస్తే తాను సంతోషపడతానని చెప్పారు. అయితే, తన కుమార్తెకు బాగా చదువుకొని సైంటిస్ట్ అవ్వాలనే కోరిక ఉందని రోజా తెలిపారు.
Roja Daughter: అన్షు మాలికకు అరుదైన గౌరవం..
ప్రస్తుతం తన కుమార్తె బాగా చదువుతోందని రోజా చెప్పారు. ఇప్పటివరకు అయితే తన కూతురికి సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఒకవేళ వస్తే తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. మరోవైపు రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత అన్షు ఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించింది. రచయితగా, ఎంటర్ ప్రెన్యూనర్‌గా, ప్రోగ్రామర్‌గా సమాజ హితం కోసం చేస్తున్న కృషికి గానూ యంగ్ సూపర్ స్టార్ అవార్డు దక్కించుకుంది. ఈ మేరకు ఇన్ఫ్ల ఎన్సర్ సంస్థ ప్రకటించింది.