Roja: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై ఏపీలో రాజకీయం దుమారం తారాస్థాయికి చేరుకుంది. ఏపీ రాజకీయాలను ఈ అంశం కుదిపేస్తుంది. గత కొద్దిరోజులుగా ఈ అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో విశ్వాసం లేని కుక్కలు అంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మరింత మంట రగిలించాయి. బాలకృష్ణ విమర్శలకు వైసీపీ నేతలు అదే రీతిలో గట్టిగా సమాధానం ఇస్తున్నారు. బాలయ్యపై పోటీ పడి మరీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
ఇక ట్విట్టర్ వేదికగా కూడా మంత్రులు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బాలయ్యపై అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా విరుచుకకుపడ్డారు. జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య అంటూ కామెంట్ చేశారు. దీంతో అంబటి రాంబాబు ట్వీట్ పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎలా పడితే అలా మారుస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ నే జోకర్ అంటూ అంబటి రాంబాబుకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇది జరుగుతుండగానే మరో మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా సీన్ లోకి వచ్చింది. ఆమె కూడా ట్విట్టర్ లో బాలయ్య వ్యాఖ్యలపై స్పందించారు.
ఫ్లూటు బాబు ముందు ఊదు బాలయ్య.. జగన్ అన్న ముందు కాదు.. అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జగన్ అనే రియల్ సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే అంటూ కామెంట్ చేశారు. దీంతో రోజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ సింహం ఏంటీ.. పిల్లి అంటూ టీడీపీ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. బాలయ్య లేజెండ్ సినిమాలోని డైలాంగ్ ను కాపీ కొట్టడం కాదంటూ రోజాపై సెటైర్లు పేల్చుతున్నారు.
Roja:
బాలయ్య, బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన లేజెండ్ సినిమాలోని ఆ డైలాగ్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. గతంలో నారా లోకేష్ కూడా కుప్పం మున్పిపల్ ఎ న్నికల ప్రచారం సమయంలో ఆ డైలాగ్ ను పేల్చారు. ఇప్పుడు ఆ డైలాగ్ నే బాలయ్యకు కౌంటర్ గా ఇచ్చేందుకకు రోజా వాడారు. టీడీపీ నేతల విమర్శలు, మంత్రుల కౌంటర్లతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంశం ఏపీలో రాజకీయ సెగలు రేపుతోంది.