Bigg boss 6 : ఇనయ ఎట్టికేలకు బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్ అయిపోయింది. ఇన్ని వారాలుగా పోరాడి పోరాడి చివరకు విజయం అయితే సాధించింది. కానీ ఆ విజయంలో జెన్యూనటి లేకపోవడమే ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఫుట్ బాల్ గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఇనయ పోరాడిన తీరు అభినందనీయం. కానీ రోహిత్‌ను నమ్మించి మోసం చేసిన తీరును మాత్రం అభినందించలేం. ఇదే ప్రేక్షకులకు విపరీతంగా కోపం తెప్పించింది. నిజానికి ఆమె గేమ్‌లో కెప్టెన్ కాకున్నా కూడా మంచి మైలేజ్ వచ్చి ఉండేది. కానీ రోహిత్‌ని మోసగించి మాత్రం చాలా వరకూ ఉన్న మైలేజ్‌ను కూడా పోగొట్టుకుంది.
తన దగ్గరికి బాల్ వచ్చినా కూడా డిస్ క్వాలిఫై చేయవద్దని.. తను కూడా చేయనని చెప్పింది. ఆమె మాట నమ్మిన రోహిత్ తన దగ్గరకు బాల్ వచ్చినప్పుడు కూడా రేవంత్‌ను డిస్ క్వాలిఫై చేశాడు కానీ ఇనయ జోలికి మాత్రం వెళ్లలేదు. కనీసం ఇనయ నుంచి బాల్ తీసుకోవడానికి ట్రై చేయలేదు. స్లిప్ అయినా కూడా రోహిత్ మాత్రం ఇనయ నుంచి బాల్ తీసుకోలేదు. ఇనయ కూడా తన మాదిరిగానే ఇప్పటి వరకూ కెప్టెన్ కాలేదని వదిలేశానన్నాడు. కానీ ఇనయ మాత్రం తన వద్దకు బాల్ రాగానే రోహిత్‌ను డిస్ క్వాలిఫై చేసింది.
ఇనయ చేసిన నమ్మక ద్రోహానికి రోహిత్ చిన్న పిల్లాడిలా రోదించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌ను ఇప్పటి వరకూ ఎప్పుడూ అలా చూడలేదు. కిందపడి మరీ ఏడ్చాడు. ఎన్ని సార్లు హర్ట్ అయినా కూడా తనను తాను సముదాయించుకున్నాడు కానీ ఇలా చిన్న పిల్లాడిలా రోదించింది లేదు. కెమెరా ఫుటేజ్ కోసం ఏడ్చాడని కూడా రోహిత్ బాధను కొట్టిపడేయలేం. అతని బాధలో చాలా జెన్యూనిటీ ఉంది. తనను అంత దెబ్బ కొట్టినా కూడా ఇనయ కెప్టెన్ కాగానే వెల్లి ఆమెను అభినందించాడు. నిజానికి ఇదొక మంచి ఎపిసోడ్ మాత్రం రోహిత్‌కు తప్పకుండా అవుతుందనే చెప్పాలి.