Bigg boss 6: బిగ్‌బాస్ షో మొదలై అటో ఇటో 50 రోజులు కావొస్తోంది.. కానీ కంటెస్టెంట్స్ నుంచి కంటెంట్ శూన్యం. ఇక ఇలాగైతే లాభం లేదనుకున్నాడో ఏమో కానీ బిగ్‌బాసే ఒక కంటెంట్‌ను క్రియేట్ చేశాడు. బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చి.. వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసి కాస్తో కూస్తో జనాన్ని షో వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్‌కు మంచి మంచి సర్‌ప్రైజ్‌లే ఇస్తున్నాడు. మటన్ బిర్యానీ, వీడియో కాల్, ఆడియో కాల్.. వీడియో మెసేజ్ అంటూ రకరకాల ఆప్షన్స్ ఇచ్చి వారి ఎమోషన్స్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు.
ఇవన్నీ ఏం ఊరికే ఇవ్వడం లేదులెండి. ఇంటిసభ్యుల చేత కొన్ని త్యాగాలను చేయించి ఆ తర్వాతే ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలాదిత్య సిగరెట్లు మానేయగా ఫైమా అతి కష్టం మీద ఇంగ్లీష్‌లో సినిమా కథలను వివరించింది. ఫైమా ఇంగ్లీష్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. బట్లర్ ఇంగ్లీష్ అంటే ఇదేనా? అనేలా ఉంటుంది. తాజాగా బిగ్‌బాస్ వీటన్నిటికంటే క్లిష్టమైన త్యాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. బాలాదిత్య త్యాగాన్ని సులువని కొట్టి పాడేయలేం లెండి. అయితే ఈసారి బ్యాటరీ రీచార్జ్ కావాలంటే.. వాసంతి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరు రెండు వారాలపాటు స్వయంగా నామినేట్ కావాలనడంతో.. రోహిత్ నామినేట్ అవడానికి ముందుకొచ్చాడు.
మీకు బిగ్‌బాస్ సీజన్ 3 గుర్తుందా? ఈ సీజన్‌లో ఏమాత్రం కంటెంట్ ఇవ్వని రోహిణిని సైతం బిగ్‌బాస్ చిన్న కారణం చెప్పి నామినేట్ చేశాడు. అదే వారం ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా రోహిత్ అతని భార్య మెరీనాను పెద్దగా ఎవరూ నామినేట్ చేయడం లేదు.ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఏమాత్రం కంటెంట్ ఇవ్వని రోహిత్‌ను బయటకు పంపించాలని స్కెచ్ గీసినట్టు టాక్. మరి రోహిత్ జాగ్రత్త పడితే హౌస్‌లో ఉంటాడు. లేదంటే ఎలిమినేట్ అయిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.ఇక తాజాగా రిలీజైన ప్రోమోలో రేవంత్‌కు ఫోటో ఫ్రేమ్, ఫైమాకు వీడియో కాల్, కీర్తికి వాయిస్ మెసేజ్ వచ్చినట్టు ప్రోమోలో చూపించారు.