ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటగాళ్ళు భారీగా పరుగులు చేసిన, బౌలర్స్ అద్బుతమైన బౌలింగ్ తో వికెట్లు తీసిన వారిని ఒక్కసారిగా హీరోని చేసేస్తారు. ఇండియా ప్రపంచంలో టాప్ జట్టులో ఒకటిగా క్రికెట్ లో ఉంది. అయితే కీలకమైన సమరాలలో భారత్ చేతులెత్తేస్తుంది అనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ఒత్తిడిని తట్టుకొని వరల్డ్ కప్ సిరీస్ లలో ఇండియా గెలిచి చాలా ఏళ్ళు అయ్యింది. రీసెంట్ గా జరిగిన 20-20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ టూర్ లో ఆ దేశంతో మూడు వన్డేల సిరీస్ లో తలపడింది. బంగ్లాని పసికూనగానే ఇప్పటికి ప్రపంచ దేశాలు భావిస్తూ ఉంటాయి.
అయితే బంగ్లాదేశ్ మాత్రం ఎప్పటికి తాము పసికూన కాదని పదే పది నిరూపించుకుంటూ ఉంటుంది. ఇక భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లు ఇంకా మరో వన్డే మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ ని బంగ్లాదేశ్ కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. మొదటి వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కి ఇచ్చిన టీమ్ ఇండియా బౌలర్స్ తో దానిని కాపాడుకున్నా చివర్లో పరుగులు సమర్పించుకొని ఓడిపోయింది. ఇక రెండో వన్డే లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 272 పరుగులని చేధించలేక చతికిలపడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ముగ్గురు తక్కువ స్కోర్ కి పెవీలియన్ చేరారు. ఇక శ్రేయాస్ అయ్యార్, అక్షర పటేల్ అర్ధసెంచరీలతో రాణించిన కీలక సమయంలో వికెట్లు పోగొట్టుకున్నారు.
అయితే ఈ మ్యాచ్ లో బొటనవెలి గాయం కారణంగా అసలు కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫీల్డింగ్ కూడా చేయలేదు. అయితే టీమ్ ఇండియా ఓటమి అంచున ఉండటంతో బ్యాటింగ్ కి రాకూడదని అనుకున్న తప్పని సరి పరిస్థితి 7వ బ్యాటర్ గా క్రీజ్ లోకి రావాల్సి వచ్చింది. గాయంతోనే బ్యాటింగ్ చేసిన రోహిత్ హిట్టింగ్ తో ఆఫ్ సెంచరీ చేసాడు. ఏకంగా 11 ఫోర్స్, 3 సిక్స్ లతో 56 పరుగులు చేశాడు. అయితే చివరి ఓవర్ లో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో 14 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓడిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ గాయాన్ని లెక్క చేయకుండా చేసిన వీరోచిత పోరాటం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. బంగ్లాదేశ్ తో సిరీస్ కోల్పోయామనే బాధ మరిచిపోయి రోహిత్ సాహసాన్ని, తెగువని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఇక మాజీలు అయితే రోహిత్ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తూనే. మరోసారి ఇండియా బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ ని పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.