Biggboss 6 : బిగ్ బాస్ సీజన్ 6.. గత సీజన్లను మించి ఈ సీజన్ నడుస్తుందేమో అనిపిస్తోంది. తొలి రోజు నుంచే గొడవలు, ఈసారి గేమ్స్‌లో ఎవరికి వారే సాటి అన్నట్టుగా నడుస్తున్నారు. రసవత్తరమైన ఘట్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక పదో ఎపిసోడ్‌ను రొమాంటిక్ సీజన్‌గా అభివర్ణించవచ్చు. ఆడియన్స్ వండర్ అయ్యే రీతిలో కొన్ని దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జోడీగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్, మెరీనా జంట చేసిన రొమాన్స్ ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. లాస్ట్‌లో రోహిత్ ఒక ట్విస్ట్ కూడా ఇచ్చాడనుకోండి అది వేరే విషయం. గతంలో వరుణ్ సందేశ్, వితికా షెరూ జోడీకి మంచి పేరొచ్చింది. వారి మాదిరిగా అనుకున్నారో.. ఏమో కానీ.. ఈ సీజన్‌లో రోహిత్, మెరీనాలు మంచి ఫుటేజ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నారు.
తొలిరోజు నుంచి చూస్తే.. రోహిత్ ఓవర్ చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. సింపుల్ అండ్ కామ్ గోయింగ్. మెరీనా కూడా అంతే కానీ కాస్త తన భర్త తోడు మరింత కోరుకుంటోంది. హగ్ ఇవ్వట్లేదు.. ముద్దు పెట్టట్లేదు అంటూ రాద్దాంతం చేస్తోంది. తన భార్యే అయినా కూడా అందరి ముందూ క్లోజ్‌గా మూవ్ అవడం అతడికి ఇబ్బందిగా అనిపిస్తోంది. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అంతే డీసెంట్‌గా ఉంటున్నాడు. అందుకే మెరీనా హగ్గు ఇచ్చినా కూడా దాన్ని ఆస్వాదించడం లేదు. ఆ విషయంలో ఇప్పటికే చాలా గొడవలు జరిగాయి కూడా. అయితే తాజాగా స్టోర్ రూమ్‌లో ఎవరూ లేరని భావించి తన భార్య మెరీనాకు చటుక్కున ముద్దు పెట్టేశాడు రోహిత్.
Biggboss 6 : మిమ్మల్ని చూస్తుంటే నాకు పెళ్ళి చేసుకోవాలనిపిస్తోంది..
ఇక పదో ఎపిసోడ్‌లో అయితే రోహిత్ మెరీనా చేతిని పట్టుకొని కాసేపు అభినయశ్రీ ఎలిమినేట్ అవడం మీద ఇద్దరూ మాట్లాడుకుంటూ నడిచారు. తన చేయి పట్టుకుని రోహిత్ నడుస్తుండటంతో ఆశ్చర్యపోయిన మెరీనా.. నువ్వేంటి? ఎప్పుడూ లేంది ఇలా నా చేతిని పట్టుకొని నడుస్తున్నావ్? అని అడిగింది. కెమేరాలున్నాయి కదా ఫుటేజ్ కోసం అని రోహిత్ అన్నాడు. అంటే నువ్వేం చేసినా ఫుటేజ్ కోసమే చేస్తావా అని మెరీనా అడిగింది. అవును నేనేం చేసినా ఫుటేజ్ కోసమే చేస్తానని రోహిత్ సమాధానం చెప్పాడు. దీంతో మెరీనా షాకైంది. ఈ ఇద్దరూ ఈ వారం నామినేషన్‌లో ఉండడంతో పెర్ఫార్మెన్స్‌కు ఫుల్‌గా పదును పెట్టారు. వీళ్ళ జంటను చూసిన నేహా.. ‘మిమ్మల్ని చూస్తుంటే నాకు పెళ్ళి చేసుకోవాలనిపిస్తోంది’ అని అనేసింది. ‘సర్లే మేం రొమాన్స్ చేసుకోవాలి. నువ్వెళ్ళిరా’ అంటూ మెరీనా ఫన్నీగా అనేసింది.