Rohit Sharma: టీమిండియా T20 ప్రపంచకప్ ను అందుకొని సరిగ్గా 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీమిండియా ఫైనల్స్ వరకు చేరుకోలేదు. దీంతో టి20 వరల్డ్ కప్ టీం ఇండియాకు అందని ద్రాక్షలా మారింది. ఇప్పుడున్న జట్టు పరిశీలిస్తే టైటిల్ ను గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి బ్యాటింగ్ లైనప్ ను పరిశీలిస్తే అన్ని జట్ల కంటే టీమిండియా ముందుంది.
హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లపై ఈ మధ్య టీమిండియా అద్భుత ప్రదర్శనను చేస్తూ వచ్చింది. ఇలాంటి సమయంలో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా వరల్డ్ కప్ గెలిచి చాలా సంవత్సరాలు అయిందని కప్ కొట్టాలంటే ఇండియా జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు మా అందరి దృష్టి వరల్డ్ కప్ లో ఆడే ప్రతి మ్యాచ్ పై ఉందని తెలిపాడు.
మ్యాచ్ జరుగుతున్నప్పుడు టీమిండియా ఆటగాళ్లు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటిస్తే మనం కోరుకున్న ఫలితాలు వస్తాయని తెలిపాడు. ఏ జట్టును తక్కువగా అంచనా వేయమని ప్రతి మ్యాచ్ ను కీలకంగా తీసుకుంటామని తెలిపాడు. ఇప్పుడే సెమీఫైనల్స్, ఫైనల్స్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని తెలిపాడు. ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని, కెప్టెన్ గా నాకిదే తొలి వరల్డ్ కప్ అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో భిన్నమైన పరిస్థితులు ఉంటాయని అందుకే మేము కొంచెం ముందుగా ఇక్కడికి వచ్చామని తెలిపాడు.
Rohit Sharma:
కెప్టెన్సీలో మంచి రికార్డు ఉన్న రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో టీమిండియాను ముందుకు నడిపించనన్నాడు. అక్టోబర్ 23న పాకిస్తాన్ తో జరిగే మొదటి మ్యాచ్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు జట్టు ఆటగాళ్లు సహకరిస్తే టి20 వరల్డ్ కప్ టైటిల్ వేట మరింత సులభం అవుతుంది. దీనికి తగ్గట్లుగానే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ వ్యూహాలు రచిస్తున్నారు.