Rohit Sharma: రోహిత్ శర్మ తన డేరింగ్, డ్యాషింగ్ ఆటతో క్రికెట్‌లో తన కంటూ ఒక ప్రత్యేక ప్లేస్ ఏర్పరచుకున్నాడు. ఇప్పటికే చాలా రికార్డులను ఆయన ఖాతాలో వేసుకున్న ఈ ప్లేయర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఇలాగే జోరు కొనసాగిస్తే అతని ఖాతాలో మరో ఐదు రికార్డులు కూడా చేరుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట రాసుకున్నాడు. వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాధిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మకు సుస్థిర స్థానం ఉండేది. వన్డేల్లో హైయస్ట్ స్కోర్ కూడా ఇతని పేరు మీదే ఉంది. వన్డే ప్రపంచ కప్‌లో ఐదు సెంచరీలు చేసిన ఘనత కూడా హిట్‌మ్యాన్‌కే లభిస్తుంది. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తను ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంఫియన్‌గా నిలిపాడు. అలాగే ఇటీవల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు మరో ఐదు రికార్డులకు ఆయన చేరువయ్యాడు.
భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు
ప్రపంచకప్‌లో ఇండియా తరఫున అత్యధికంగా సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా రోహిత్ నిలవనున్నాడు. మరో మూడు సిక్సర్లు కొడితే ఈ రికార్డు రోహిత్ ఖాతాలో చేరుతుంది. గడిచిన ఆరు ఎడిషన్లలో రోహిత్ మొత్తం 31 సిక్సర్లు కొట్టాడు. 33 సిక్సర్లతో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ప్రస్తుత రికార్డు ఉంది. అలాగే టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా కూడా ఈయన నిలవనున్నాడు. మూడు సిక్సర్లు కొడితే ఈ రికార్డు ఆయన పేరిట చేరుతుంది.
Rohit Sharma:
అలాగే టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా కూడా రోహిత్ మరో రికార్డు నెలకొల్పనున్నాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు దిల్షాన్(35), డ్వేన్ బ్రావో (34), షాహిద్ అఫ్రిది (34), షోయబ్ మాలిక్ (34), ఎంఎస్ ధోని (33), క్రిస్ గేల్ (33), ముష్ఫికర్ ఉన్నారు. రోహిత్ మరో 2 గేమ్స్ ఆడితే ఈ రికార్డు రోహిత్ ఖాతాలో చేరుతుంది. అలాగే టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ తన భీకర ఆటను ప్రదర్శిస్తే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును తన పేరిట చేర్చుకోగలడు. అలాగే టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు, టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా హైయస్ట్ స్కోర్ వంటి రికార్డులు కూడా ఆయన్ని ఊరిస్తున్నాయి.