Rohit Sharma: కొందరు కష్టపడినా విజయం దక్కదు. కానీ కొందరికి మాత్రం లక్ కలిసివస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడే తత్వతో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి. టీమిండియా విషయంలో రోహిత్ శర్మ లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే రోహిత్ కెప్టెన్‌గా చేసిన అన్ని ఫార్మాట్‌లలోనూ తొలి సిరీస్ లేదా తొలి టోర్నీలను గెలుపొందాడు. దీంతో రోహిత్ సెంటిమెంట్ టీమిండియాకు కలిసివస్తుందని అతడి అభిమానులు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నారు.
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తొలిసారి కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్‌కు టైటిల్ అందించాడు. అంతేకాకుండా తొలిసారి కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను కూడా సాధించిపెట్టాడు. అటు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి వన్డే సిరీస్, తొలి టీ20 సిరీస్, తొలి ముక్కోణపు సిరీస్, తొలి టెస్ట్ సిరీస్, తొలి ఆసియా కప్‌లను రోహిత్ గెలుపొందాడు. దీంతో రోహిత్ ప్రస్తుతం తొలిసారి కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుస్తాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.
ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే ఆ జట్టు దురదృష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టు కీలక మ్యాచ్ ఆడుతుందంటే వరుణుడు కూడా అడ్డుపడుతుంటాడు. అంతేకాకుండా అనుకోని విధంగా ఓటమి కూడా ఎదురవుతుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలో దక్షిణాఫ్రికా రికార్డు ఏ మాత్రం బాగోలేదు. ఆ జట్టు నాకౌట్ మ్యాచ్ ఆడుతుందంటే అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందే. ఆదివారం నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా ఆడిన మ్యాచ్ చూస్తే ఎవరైనా ఈ విషయం అంగీకరించి తీరాల్సిందే.
Rohit Sharma: ఆ మ్యాచ్ కారణంగా చేజారిన సెమీస్ బెర్త్
బంగ్లాదేశ్‌పై భారీ విజయం, టీమిండియా అద్భుత గెలుపు చూసి దక్షిణాఫ్రికా సెమీస్‌కు వెళ్లడం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ అంతకుముందు సూపర్-12లో దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆడింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు గెలవాల్సింది. 7 ఓవర్లలో 64 పరుగులు చేస్తే గెలుపు ఆ జట్టు సొంతం అవుతుంది. కానీ మూడు ఓవర్లలోనే 51 పరుగులు చేసింది. కానీ వర్షం కారణంగా అనూహ్య స్థితిలో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో జింబాబ్వే, దక్షిణాఫ్రికా చెరో పాయింట్ పంచుకున్నాయి. ఈ ఫలితం తర్వాత రెండు అద్భుత విజయాలతో సెమీస్ రేసులోకి వెళ్లిన దక్షిణాఫ్రికా జింబాబ్వే మ్యాచ్ ఫలితం కారణంగా టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోయింది.