విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో ఆ బాధ్యతను బిసిసిఐ రోహిత్ శర్మకు అప్పజెప్పింది.34 ఏళ్ల వయసున్న రోహిత్ కు కెప్టెన్ గా మంచి రికార్డ్ ఉన్నప్పటికీ ఈ నిర్ణయం పట్ల కొందరు సీనియర్స్,క్రికెట్ అభిమానులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్లేయర్ గా రోహిత్ కెరియర్ ముగియడానికి ఎక్కువ సమయం లేదు ఇలాంటి సమయంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా బిసిసిఐ రోహిత్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పడం ఏంటని వారు బోర్డ్ ను ప్రశ్నిస్తున్నారు.
కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాక ఆ బాధ్యతను యువ ఆటగాళ్లు అయినా కే.ఎల్ రాహుల్,శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ లలో ఒకరికి బిసిసిఐ ఇస్తుందని అందరూ భావించారు కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టంలేని బిసిసిఐ రోహిత్ వైపే మొగ్గు చూపింది.