Rock salt Benefits: మనం తీసుకునే ఆహారం వల్లే మనకు అనారోగ్యం మొదలువుతందని నిపుణులు చెబుతుంటారు. మనం ఆరోగ్యకరమైన, శరీరానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే మనం రోజులో తీసుకునే ఉప్పు మరియు చక్కెర వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని నియంత్రించగలిగితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. గుండెపోటు, హైపర్ టెన్షన్, పెద్దపేగు క్యాన్సర్ లాంటి ఎన్నో సమస్యలకు మనం అధికంగా తీసుకునే ఉప్పు కారణం.
ఒక మనిషి రోజుకు ఎంత ఉప్పును తీసుకోవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించడం జరిగింది. ఒక రోజుకు 1.5గ్రాముల నుండి 2.3గ్రాముల ఉప్పును తినడం మంచిది. మధ్య వయసులోని వారు 5గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీని కన్నా ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్యంపాలవుతారు. అయితే ఆయుర్వేదం ప్రకారం సాధారణ ఉప్పు కన్నా రాక్ సాల్ట్ తీసుకోవడం ఎంతో మంచిది. ఇంతకీ రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.
కంటికి మేలు:
ఆయుర్వేదం ప్రకారం సాధారణ ఉప్పుకు బదులు మనం రాక్ సాల్ట్ వాడితే కంటికి మేలు కలుగుతుంది. ఆహారంలో దీనిని వాడటం వల్ల రకరకాల ఇన్షెక్షన్ల నుండి రక్షణ లభించడంతో పాటు కళ్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
జీర్ణక్రియ మెరుగు:
సాధారణ ఉప్పు స్థానంలో రాక్ సాల్ట్ ని వాడటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే కడుపు ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. అదనంగా శరీరానికి చల్లదనం, శక్తి లభిస్తాయి.
Rock salt Benefits: గుండె సమస్యలకు చెక్:
రాక్ సాల్ట్ వాడటం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేదంలో వివరించబడింది. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని రాక్ సాల్ట్ తగ్గిస్తుంది.