Ritu Varma : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లుగా కొనసాగుతున్న తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకటో రెండో సినిమాలు చేసి ఆ తర్వాత ముఖం చాటేసే భామలు చాలా మంది. ఇండస్ట్రీలో కలిసి రాక లేదా ఛాన్స్ లేక తెలుగు అమ్మాయిలు వెండితెరకు పరిచయం అవ్వడం చాలా తక్కువే అని చెప్పాలి. కొద్ది మంది మాత్రమే తమ లక్కుని పరీక్షించుకొని స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరుకుంటుంటారు. ఇండస్ట్రీలో తమకంటూ క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలా పాపులర్ అయిన హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు.

Ritu Varma : షార్ట్ ఫిల్మ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. పెళ్లిచూపులు సినిమాతో ఫేమస్ అయ్యింది రీతూ వర్మ . తన టాలెంట్ తో ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ వస్తోంది. యువ హీరోల సరసన నటిస్తూ తన నటనతో మెప్పిస్తుంది రీతూ వర్మ.

సినిమాల్లో నటించడం మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది రీతూ వర్మ. తన పర్సనల్ విషయాలను , ప్రొఫెషనల్ సంగతులను ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. హాట్ ఫోటో షూట్లను చేస్తూ ఫాన్స్ ను ఇంప్రెస్ చేస్తుంటుంది. తాజాగా రీతూ వర్మ హాలిడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది. కెనడాకు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ అందమైన లొకేషన్ లో విహరిస్తూ సందడి చేస్తోంది. తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను రీతూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆరెంజ్ కలర్ పూలతో డిజైన్ చేసిన బాడీ కాన్ డ్రెస్ ని వేసుకొని రీతూ వర్మ యూత్ ను పరేషాన్ చేస్తోంది. బోట్ లో దిగిన ఈ పిక్స్ లో ఎంతో హాట్ గా కనిపించింది . స్లీవ్ లెస్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ తో వచ్చిన అవుట్ ఫిట్ రీతూ కలర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సింపుల్ మేకప్ తో స్టాండింగ్ లుక్స్ తో అదరగొట్టింది రీతూ. చెవులకు అందమైన స్టడ్స్, కళ్లకు బ్లాక్ కలర్ గాగుల్స్ పాదాలకు ఫ్లాట్ ఫుట్ వేర్ వేసుకొని మెస్మరైజ్ చేసింది.

రీతూ వర్మ తెలుగు , తమిళ సినిమాలలో బిజీ బిజీగా నటిస్తోంది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసి యమ జోష్ లో ముందుకెళ్తోంది. తెలుగులో రెండు తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.
