Ritu Varma: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చింది హీరోయిన్ రీతూ వర్మ. మొదటి సినిమానే మంచి సక్సెస్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో తన అందం అభినయం నటనతో యూత్ ని కట్టిపడేసింది రీతూ వర్మ.
అలాగే ఈ సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండకు అలాగే హీరోయిన్ రీతు వర్మ కు ఇద్దరికీ వరుసగా అవకాశాలు వచ్చి చేరాయి.పెళ్లిచూపులు సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది.
ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అనంతరం ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది రీతూ. ఇక టక్ జగధీష్,వరుడు కావలెను వంటి చిత్రాల్లో మెరిసింది.
అయితే ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ ను సాధించలేకపోయాయి. కానీ హీరోయిన్ రీతు వర్మ కి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. మరి ముఖ్యంగా టక్ జగదీష్ సినిమాలో అమాయకమైన నటన అందంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అయితే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
తెలుగు తోపాటు తమిళంలో కూడా నటించి వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది రీతూ వర్మ. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ యువతకు అందాల కనువిందు చేస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా రీతు వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం రీతు వర్మ విదేశాలలో విహరిస్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించి కూలింగ్ గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్ ను ధరించి ఫోటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చింది.