Ritu Varma: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రీతు వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కాగా విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతోపాటు హీరోయిన్ రీతు వర్మ కు కూడా మంచి పేరును తెచ్చి పెట్టింది. మొదటి సినిమా తోనే తన అందం అభినయం క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న రీతు వర్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంది.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. టక్ జగధీష్,వరుడు కావలెను వంటి చిత్రాల్లో మెరిసింది. ఇంకా వరుడు కావలెను, టక్ జగదీష్ ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది.
రీతూ వర్మ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ట్రెడిషనల్, స్టైల్లిష్, పొట్టి డ్రెస్ లలో కనిపిస్తూ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఈమె తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచింది అని చెప్పవచ్చు.
అంతేకాకుండా తన ఇంస్టాగ్రామ్స్ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రీతు వర్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను బట్టి చూస్తే రీతు వర్మ విదేశాలకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆమె వెనుక వైపు ఉన్న వాతావరణం అన్నీ చూస్తే తప్పకుండా విదేశాలకు వెకేషన్ లకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఇక ఆ ఫోటోలలో ఆమె టిక్ బ్లూటూత్ లైట్ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి స్టైలిష్ గా కూలింగ్ గ్లాసెస్ హ్యాండ్ బ్యాగ్ ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.