Rishabh Pant: మరికొన్ని గంటల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొననుంది. టీమిండియా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో పాల్గొన్నది. వీటిలో మొదటి మ్యాచ్ లో గెలిచి, ఒకటి రెండో మ్యాచులో ఓడింది. టీమిండియా ఆటగాళ్లకు కాస్త ప్రాక్టీస్ దొరికిన కొంతమంది ఆటగాళ్లు మాత్రం నిరాశపర్చారు. ఇందులో నిరాశపరిచిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడు.
ఇండియాకు ఆడాలంటే ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. అలాంటిది రిషబ్ పంత కు చాలా అవకాశాలు వచ్చాయి. తాజా ఫామ్ ను పరిశీలిస్తే రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేవి చేయలేదు. దీంతో క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ ను T20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయడం పట్ల ఆగ్రహంతో ఉన్నారు.
మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో భీకరమైన ఫామ్ ను కొనసాగించిన రిషబ్ పంత్ ఇప్పుడు మాత్రం తేలిపోతున్నాడు. ఇలాంటి ప్రదర్శనను కొనసాగిస్తే టీం లెవెన్ లో చోటు కూడా దక్కకపోవచ్చు అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Rishabh Pant: రిషబ్ పంత్…
సాధారణంగా T20ల్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లు ఉంటారు. రిషబ్ పంత్ బౌండరీ లైన్ వద్ద ఎక్కువగా అవుట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎంతవరకు రిషబ్ పంత్ కు అండగా ఉంటారో వేచి చూడాలి. తాజాగా మరోసారి ఊర్వశి రౌటెలా విష పంత్ల కాంట్రవర్సీ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.