Rishabh Pant: గాయం కారణంగా వరల్డ్ కప్ కి ముందే ఇండియా జట్టుకు ఇద్దరు కీలక ఆటగాళ్ళు దూరమయ్యారు. వీరి స్థానాల్లో అక్షర్ పటేల్, మమ్మద్ షమీ జట్టులోకి వచ్చారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచులో ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మోకాలికి కట్టు కట్టుకుని కనిపించాడు. దీంతో క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ కూడా జట్టుకు దూరం అవ్వొచ్చని ఆందోళన చెందుతున్నారు.
వామప్ మ్యాచ్లో బ్యాట్స్ మెన్ అందరికి కావాల్సినంత ప్రాక్టీస్ దొరుకుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ తన కాలికి కట్టుతో కనిపించాడు. ఈ మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మధ్య టీమిండియా ఆడిన మ్యాచుల్లో సైతం దినేష్ కార్తీక్ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాడు. దీంతో రిషబ్ పంత్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీనిపై టీమిండియా కానీ, బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. ఇప్పటికే గాయాల కారణంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరం అవడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అసలు ఆరంభానికి ఇంకొంచెం సమయం ఉన్నా రిషబ్ పంత్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
Rishabh Pant:
టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉన్న రిషబ్ పంత్ ఈ T20 వరల్డ్ కప్ లో జట్టుకు ఆడతాడా? ఆడితే మంచి ప్రదర్శనను చేస్తాడా? అని సగటు క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ T20 వరల్డ్ కప్ లో దినేశ్ కార్తీక్ నుంచి రిషబ్ పంత్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. దినేశ్ కార్తీక్ కు ఈ వరల్డ్ కప్ చివరిది అవుతుండడంతో రిషబ్ పంత్ అభిమానులు టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ లో రిషబ్ పంత్ ను చూసే అవకాశం ఉంది.
Rishabh Pant seen with heavy strapping and ice pack on his right knee.@RevSportz #T20WorldCup https://t.co/Q8Uf5c2PzA pic.twitter.com/pY5uaoobXe
— Subhayan Chakraborty (@CricSubhayan) October 17, 2022