Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు మాంచి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే హౌస్‌లో కాస్త గొడవలు కూడా ప్రారంరభమయ్యాయి. ముఖ్యంగా శ్రీహాన్, రేవంత్‌ల మధ్య చిన్న వార్ నడుస్తోంది. కాగా.. నిన్న ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు కంటెస్టెంట్స్ సమాధానాలిచ్చారు. శ్రీసత్యను.. ఇనయనైతే తన ఫ్రెండ్‌ని వెన్నుపోటు పొడిచిందన్నదని.. కానీ రేవంత్ విషయంలో మీరు చేసింది కూడా అదే కదా అని ప్రశ్నించారు. ఆయన్ను మూడు సార్లు నామినేట్ చేసిందని పైగా కెప్టెన్సీ టాస్క్‌లో కూడా రేవంత్ సాయమందించలేదు సరికదా.. అర్జున్‌ను యూజ్ చేసుకుందని అసలు మీరు చెప్పే విషయాలు మీరైనా పాటిస్తారా? అని ప్రశ్నించారు.
ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకు శ్రీసత్య.. తప్పుంటే ఎవరినైనా నామినేట్ చేస్తానని.. రేప్పొద్దున శ్రీహాన్‌ది తప్పుంటే అతడిని కూడా నామినేట్ చేస్తానని బదులిచ్చింది. ఇనయను రెచ్చగొట్టేందుకు వెన్నుపోటు వ్యాఖ్యలు చేశానని తెలిపింది. స్నేహం వేరు గేమ్ వేరని.. పాయింట్ ఉంటే శ్రీహాన్‌ను సైతం నామినేట్ చేస్తానని చెప్పింది. అర్జున్‌ను తాను యూజ్ చేసుకోలేదని.. హోటల్ టాస్క్‌లో సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాని.. తాను చెప్పే విషయాలు కచ్చితంగా పాటిస్తానని శ్రీసత్య వెల్లడించింది.
ఇక శ్రీహాన్‌ను.. కీర్తినైతే వంట చేయాలని కరాఖండీగా చెప్పేశావు. ఆమె తనకు రాదన్నా నేర్చుకోమన్నావు.. మరి శ్రీసత్యకు ఎందుకు అలా చెప్పలేదు? అని ప్రశ్నించారు.
వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే కీర్తిని కిచెన్ టీమ్‌లో వేశానని.. అంతేకాకుండా ఆమె కిచెన్ టీంలో పనిచేయడం తాను చూసినట్టు చెప్పాడు. శ్రీసత్య వంట చేయనన్న మాట తనకు వినిపించలేదని చెప్పి తప్పించుకున్నాడు. అయినప్పటికీ శ్రీసత్య కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందని సమర్థించాడు. కానీ నిజానికి శ్రీసత్య తనకు వంట రాదని.. చేయనని శ్రీహాన్‌కు చెప్పింది. అతను ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు.