జులై 4వ తేదీన 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించిన రోశయ్య గారు గుంటూరులోని హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు.ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున1968,1974,1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు ఈయన మొదటిసారి మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లో రోడ్డు రహదార్లు శాఖ,రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు.ఆతరువాత పలు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేసిన ఈయన వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పని చేసి ప్రజలకి బాగా దగ్గరయ్యారు.
వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పద్నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన రోశయ్య 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.ఆతరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఈయన తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలు అందించారు.ఇలా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన ఈయన పాలిటిక్స్ నుండి రిటైర్ అయ్యారు.తాజాగా హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో తన నివాసంలో ఉంటున్న ఈయనకు బీపీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ కు తరలించారు.పరిస్థితి విషమించడంతో ఆయన తన తుది శ్వాస విడిచారు.
ఈ వార్త విన్న రాజకీయ నాయకులు,పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.రేపు ఈయన అంత్యక్రియలు నిర్వహించే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని సమాచారం.