Richa Chadha : బాలీవుడ్ నటి రిచా చడ్డా అద్భుతమైన ఫ్యాషన్ వాది. ఈ నటి ఫ్యాషన్ డైరీలు రోజురోజుకీ మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి. తాజాగా రిచా అద్భుతమైన చీరకట్టుతో దిగిన హాట్ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఓ ఫోటోషూట్ కోసం అదిరిపోయే చీరను కట్టుకొని అందరి చూపులు తనువైపుకు తిప్పుకుంది. రెగ్యులర్ ఎత్నిక్ ఫ్యాషన్ కు కొత్త ట్విస్ట్ ఇచ్చి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది.

Richa Chadha : ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ కు మ్యూస్ గా వ్యవహరించింది రిచా. ఈ డిజైనర్ షెల్ఫ్ నుంచి మెటాలిక్ చీరను ఎన్నుకుని దానిని అందంగా కట్టుకొని కుర్రాళ్ళ మతులు పోగొట్టింది.

ఈ మెటాలిక్ చీరకు జోడిగా ప్లంగింగ్ నెక్ లైన్, ఓవర్ లాపింగ్ పాట్రన్స్ తో ఉన్న ఆఫ్ షోల్డర్ సిల్వర్ కార్సెట్ బ్లౌజు వేసుకుంది. ఈ బ్లౌజ్ ద్వారా రిచా తన ఎద అందాలను ఎలివేట్ చేస్తోంది. కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ స్టన్నింగ్ శారీ లుక్ కోసం సింపుల్ డైమండ్ జ్యువల్లరీని ఎంచుకుంది. అవుట్ హౌస్ జ్యువలరీ షెల్ఫ్ నుంచి సెలెక్ట్ చేసిన డైమండ్ ఇయర్ రింగ్స్ ను తన చెవులకు అలంకరించుకుంది. ఈ పిక్స్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది రిచా. ఐ డోంట్ గివ్ ఎ గ్లామ్ అని క్యాప్షన్ ని జోడించింది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ అనిషా గాంధీ రిచా అందాలకి మరింత స్టైలిష్ లుక్ ని అందించింది. తన కురులతో మధ్య పాపిట తీసుకొని లూజ్ గా వదులుకుంది రిచా. కనులకు సిల్వర్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్, మస్కరా దిద్దుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని మత్తెక్కించింది.