RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ విషయంపై స్పందిస్తారో తెలియదు.అలయ్ – బలయ్‌లో మెగాస్టార్ చిరంజీవికి.. ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావుకి మధ్య ఇష్యూ జరిగిన అనంతరం నుంచి ఆయన తన ద ష్టంతా గరికపాటి పైనే పెట్టారు. అలయ్ బలయ్‌లో జరిగిన ఘటనపై వర్మ స్పందిస్తూ.. ‘ హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు..మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదొక్కటేనా? వరుస ట్వీట్లతో గరికపాటిని ఏకి పారేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆర్జీవీకి గట్టిగానే క్లాస్ పీకారు. అయినా ఊరుకుంటేనా? ఇవాళ మరోసారి రెచ్చిపోయారు. గరికపాటిని.. గడ్డిపాటి అని.. గొర్రెపాటి అని ఒక్కో ట్వీట్‌లో ఒక్కో రకంగా పిలుస్తున్నారు.గరికపాటి ప్రవచనాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేయడం దానికి ఏదో ఒక పోస్ట్‌ను పెట్టి ఆనందించడం వర్మకు పరిపాటిగా మారింది. నిజానికి మెగా ఫ్యామిలీకి ఈయన డెడ్ యాంటీ. అలాంటిది ఒక్కసారిగా ఫేవర్‌గా మారిపోయి ట్వీట్స్ చేయడం అందరికీ ఆసక్తికరంగా మారింది.
నేడు గరికపాటి ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వీడియోను షేర్ చేసి దానికో అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. గరికపాటి ప్రారంభంలోనే తండ్రిగా భావించి చెబుతున్నానన్నారు. కానీ వర్మ మాత్రం ఆడవారిని గరికపాటి చాలా దగ్గరగా ఫాలో అవుతున్నారంటూ పోస్ట్ పెట్టారు. ‘ఆడవారి డ్రెస్సింగ్ గురించి ఇంత అమర్యాదకరంగా గొర్రెపాటిని మించి ఎవరూ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన చాలా విషయాల్లో ఆడవారికి చాలా దగ్గరగా ఉంటారనుకుంటా’ అని పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు నోటికి పనిజెప్పారు. ‘ ఈ కుక్క కి సినిమా ఛాన్సులు లేక పిచ్చోడి లా మారిపోయాడు మంచి సినిమా తీయడం ఎలానో చేత కాదు బతుకు బతకడం కూడా రాదు ఈ పిచ్చి కుక్క కి వీడు వీడి బూతు సినిమాలు రిప్ ఆర్జీవీ’అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Never seen anyone talk about women ‘s dressing more disrespectfully than Gorre Pati .. I suspect that he is a closet “Lot of things” pic.twitter.com/DT4846xEyv
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022