RGV: కాంతార,చిన్న చిత్రంగా కన్నడలో మొదలైన ఈ చిత్రం ఇప్పుడొక ప్రభంజనం. కన్నడనాట అనే కాదు దేశంలో ఎక్కడ చూసినా కాంతార జోరే కనపడుతుంది. మంచి కథాంశాన్ని జనాలకు నచ్చే పద్ధతిలో చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఉన్న ఇంకొక మంచి విషయం ఏంటంటే దేవుడి మాట వినిపించే వ్యక్తి మాట్లాడినప్పుడు ఒరిజినల్ కన్నడ డైలాగ్స్ నే ఉంచడం జరిగింది. పాన్ ఇండియా చిత్రంలో ఇదొక కొత్త ఒరవడి.
సామాన్య ప్రేక్షకులే కాదు,సినీ ప్రముఖులు కూడా కాంతార అభిమానులుగా మారిపోయారు. అన్ని వైపుల నుంచి కాంతార మేకర్స్ కి మంచి అబినందనలను అందుతున్నాయి. ఈ జాబితాలో సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్‌వర్మ కూడా చేరారు. ఈ కన్నడ చిత్రాన్ని ఆయన ఆకాశానికెత్తేశారు.
ఆయనదైన శైలిలో రాంగోపాల్‌వర్మ కాంతార చిత్రాన్ని పొగుడుతూనే ఇతర దర్శక నిర్మాతలపైన సెటైర్లు వేశారు. కాంతార చిత్రంతో అన్ని భాషలు చిత్ర పరిశ్రమలకు ఒక గుణపాఠం చెప్పారు అన్నారు రాంగోపాల్‌వర్మ. ఇలా చేసినందుకు పరిశ్రమలోని వారు కాంతార మేకర్స్ కి ట్యూషన్ ఫీజు ఇవ్వాలంటూ తనదైన శైలిలో అన్నారు.
RGV:
కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ చెప్పినదాంట్లో అతిశయోక్తి లేదు. మాములుగా పాన్ ఇండియా చిత్రం అంటే భారీ బడ్జెట్,భారీ తారాగణం,ఊపిరిసలపని ఫైట్స్ ఉండాలి అనుకుంటారందరూ. కానీ సరైన కథని సరైన పద్దతిలో చెపితే ఇవేవీ అవసరం లేదు అని ఈ చిత్రం నిరూపించింది. అసలు కాంతార చిత్రం వచ్చేదాకా చాలా మందికి రిషబ్ శెట్టి అనే పేరు కూడా తెలియదు. మంచి కథకి పేరున్న నటులు అవసరం లేదని నిరూపిస్తూ కాంతార విడుదలయిన అన్ని భాషల్లో మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని మళయాలంలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధపడుతున్నారు. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి హీరో,దర్శకుడు కూడా. 16 కోట్ల బడ్జెట్‌తో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు.