ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సినిమా టికెట్స్ వ్యవహారంపై పెద్ద రచ్చ జరుగుతుంది.ఈ అంశంపై అటు సినీ పెద్దలు ఇటు ప్రభుత్వ పెద్దల నుండి మంతనాలు జరుగుతున్న వీరిరువురు ఒక అభిప్రాయానికి రాలేకున్నారు.ఈ అంశంపై స్పందిస్తున్న ప్రతిపక్ష పార్టీలు పెట్రోల్,డీజల్ రేట్ లు అడిగిన తగ్గించట్లేదు కానీ ఎవరూ అడగకున్న సినిమా టికెట్ రేట్లు మాత్రం తగిస్తారా అని ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా ఈ అంశంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీవీ9 లో రాత్రి 7 గంటలకు నిర్వహించే డిబేట్ లో పాల్గొనబోతున్నాడు.ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.దీనితో వర్మ ఈ అంశంపై ఏం మాట్లాడుతాడో అని అందరూ ఆసక్తిగా ఈ డిబేట్ కోసం ఎదురు చూస్తున్నారు.