RGV – KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అధికారికంగా అడుగు పెట్టేశారు. అందులో భాగంగా తన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, అభివృద్ధి అనేది అందరికీ వర్తించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దసరా సందర్భంగా ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతల మధ్య అట్టహాసంగా జాతీయ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించేశారు. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. దేశ రాజకీయాల్లో కొత్త శకం మొదలు కానుందని, గుణాత్మక మార్పు అంటే ఏమిటో కేసీఆర్ చూపిస్తారంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక రాజకీయాలతో సంబంధం లేకపోయినా మోస్ట్ కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడం మీద స్పందించారు. ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలని ఎప్పుడూ ప్రయత్నించే రాంగోపాల్ వర్మ తాజాగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల నుండి దేశ రాజకీయాల వైపు అడుగులు వేయడం మీద తనదైన స్టైల్ లో స్పందించాడు.
RGV – KCR:
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనను ప్రస్తావిస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. ‘టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ ఆదిపురుషుడు అయ్యాడు’ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అలాగే ‘వెల్ కం టూ నేషనల్ పాలిటిక్స్’ అంటూ తన పోస్టును ముగించాడు.
By Making TRS into BRS , KCR became the AdiPurush (1stMan) to do it ..Welcome to NATIONAL POLITICS 💐
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2022