Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మంగళవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా రసవతారంగా సాగింది. కెప్టెన్సీ పోటీదారులు కావటానికి “సిసింద్రీ టాస్క్” ఇంటి సభ్యులకు ఇవ్వటం తెలిసిందే. దీనిలో భాగంగా మొదటి ఛాలెంజింగ్ టాస్క్ “సక్స్ అండ్ షేప్స్”లో చంటి గెలిచి మొదటి కెప్టెన్సీ పోటీదారుడు కావడం జరిగింది. వాస్తవానికి ఈ టాస్క్ లో రేవంత్ గెలవాల్సింది. ఫైమా చేసిన పనికి.. రేవంత్ ఓడిపోయాడు.
అయితే టాస్క్ ఆడుతున్న గాని “సిసింద్రీ టాస్క్” లో భాగంగా చేతికిచ్చిన బేబీ బొమ్మలను ఇంటి సభ్యులు జాగ్రత్త పరుచుకోవాలి..అది బిగ్ బాస్ రూల్. ఈ క్రమంలో “సక్స్ అండ్ షేప్స్” టాస్క్ తర్వాత రిలాక్స్ అవుతున్న రేవంత్ తన బొమ్మ మర్చిపోవడంతో గీతు వెంటనే… రేవంత్ బేబీ “లాస్ట్ అండ్ ఫౌండ్” జోన్ లో వేయటంతో రేవంత్ రెండో వారం కెప్టెన్సీకి అనర్హుడు అయిపోయాడు.
పరిస్థితి ఇలా ఉంటే గీతు .. తన బేబీ బొమ్మ ఎవరికి తెలియకుండా స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది. రాత్రంతా గీతూ బొమ్మ కోసం ఇంటి సభ్యులు హౌస్ మొత్తం గట్టిగానే వేతికారు. కానీ ఎవరికి దొరకలేదు. ఉదయం బ్యాటరీలు స్టోర్ రూమ్ కి వచ్చిన సమయంలో.. రేవంత్.. ఫ్రిడ్జ్ వెనకాల గీతు బొమ్మని కనిపెట్టి.. తీసుకెళ్లి “లాస్ట్ అండ్ ఫౌండ్” జోన్ లో వేసి గీతూపై రేవంత్ రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ ఫుటేజ్ మొత్తం బిగ్ బాస్ లైవ్ లో కనిపించడం జరిగింది.